సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలోని భూవివాదాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ గారు ఎంతో పారదర్శకంగా నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యమే సాగుతుందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం రామగుండం బీ పవర్ హౌస్ వద్ద ట్రాక్టర్లను వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రైతుల భూముల కష్టాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. […]