Breaking News

పెద్దకొత్తపల్లి

పేకాట రాయుళ్ల అరెస్టు

పేకాట రాయుళ్ల అరెస్టు

సారథి, కొల్లాపూర్(పెద్దకొత్తపల్లి ): నాగర్​ కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్ పాముల గ్రామంలో పేకాట ఆడుతున్న 9మంది పేకాటరాయుళ్ల స్థావరాలపై దాడిచేసి అరెస్టు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. వారి నుంచి రూ.8,940 నగదు, అలాగే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. మున్ముందు గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కఠినమైన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.

Read More
విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ

విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ

సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు గురువారం అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 200 మంది విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులు అందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లను ప్రభుత్వం విస్మరించిందని, పాఠశాలలు తెరుచుకోకపోవడంతో 14 నెలలుగా […]

Read More
పల్లెప్రగతి పనులు పూర్తిచేయాలి

పల్లెప్రగతి పనులు పూర్తిచేయాలి

సారథి, పెద్దకొత్తపల్లి(కొల్లాపూర్): గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపీడీవో కృష్ణయ్య సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల కల్లాలు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, పలు రకాల పనుల పురోగతిపై మాట్లాడారు. వానాకాలంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Read More