సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభివాణి దేవిని అధిక మెజార్టీతో గెలిపించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య పట్టభద్రులను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో మానవపాడు మండలం, పల్లెపాడు, బోరవెల్లి, చండూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల […]