సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్చేస్తూ బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు శివవర్మ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రజలను కాపాడిన మున్సిపల్ సిబ్బంది కృషి మరువలేనిదని కొనియాడారు. పెంచిన వేతనాలను జూన్ నుంచి అమలు చేయాలని డిమాండ్చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రిషన్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, […]
ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీపికబురు ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి.. త్వరలోనే 50వేల ఉద్యోగ నియామకాలు మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పీఆర్సీపై సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.పీఆర్సీలో 30శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 11వ పీఆర్సీ అమలు ఆలస్యమైందని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర […]
సారథి న్యూస్, బిజినేపల్లి: ఈనెల 12న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ మండల జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర తొలి పీఆర్సీ సిఫార్సుల ప్రకారం రూ.19వేల జీతం ఇవ్వాలని కోరారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు […]