విశ్వసనీయ వర్గాల సమాచారం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం పట్టుబడ్డ ఇద్దరు పాకిస్తానీ స్పైలలో ఒకరు ఇండియన్ రైల్వేస్, ఆర్మీ, ఎక్విప్‌మెంట్ గురించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్మీని తరలించే రైళ్ల గురించి అన్ని వివరాలు తెలిసిన వ్యక్తి ద్వారా వివరాలు రాబట్టాలని ప్రయత్నించాడని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వీసా సెక్షన్‌లో పనిచేస్తున్న అబిద్ హుస్సేస్, తాహిర్ ఖాన్‌లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వాళ్లిద్దరినీ పాకిస్తాన్ స్పైలుగా గుర్తించిన […]