సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని స్వయంభూ ఉమాసంగమేశ్వర దేవాలయం కొప్పోలులో సహాయ అర్చకుడిగా పనిచేసే మనోహర్ రావు జ్వరంతో బాధపడుతున్నాడు. విషయం తెలిసి గురుమదనానంద బ్రాహ్మణ సేవా రుద్రపరిషత్ కన్వీనర్, అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడి చంద్రశేఖర్ ఆలయానికి వెళ్లి ఆయనకు పండ్లు, మందులు, ఇతర ఆహార పదార్థాలు అందజేశారు.