సారథి న్యూస్, పెద్దశంకరంపేట: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొఫెషనల్ సమయాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించడంతో పాటు రెగ్యులర్ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడంపై మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో ముఖ్యమంత్రి తమ సమస్యలపై స్పందించడంతో వారు హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా నాయకులు నరసింహాగౌడ్, పంచాయతీ కార్యదర్శులు ప్రభాకర్ రమేష్ మహిపాల్ పాల్గొన్నారు.