సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు మంగళవారం వరద నీరు పోటెత్తింది. దీంతో నాలుగు షట్టర్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు రోజులుగా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి పెద్దఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యానికి మించి చేరడంతో గేట్లను తెరిచినట్టు అధికారులు తెలిపారు.