Breaking News

నారాయణపేట

‘పేట’ కలెక్టరేట్​ ఎదుట కలకలం

సారథి న్యూస్​, నారాయణపేట: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్​పల్లి గ్రామానికి చెందిన నాగప్ప గ్రామంలోని సర్వేనం.230, 225, 248లో 4.20 ఎకరాల భూమి కాస్తులో ఉన్నారు. కాగా, ఈ భూమి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు పేర పట్టా ఉంది. ప్రభాకర్ రావు మృతి చెందడంతో ఆయన కొడుకు గంగాసాగర్ రావు విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, కొన్నేళ్లుగా తామే కాస్తులో ఉండి పంటలు సాగు చేస్తున్నామని, తమకు పట్టా అమలుచేసి ఇవ్వాలని గంగాసాగర్​రావును […]

Read More
నాటుపడవ బోల్తా.. నలుగురు గల్లంతు

నాటుపడవ బోల్తా.. నలుగురు గల్లంతు

మక్తల్​: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల గ్రామం సోమవారం కృష్ణానదిలో నాటుపడవ మునిగి ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి గల్లంతయ్యారు. వీరిని కర్ణాటకలోని కురంగడ్డ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. నిత్యావసర సరుకుల కోసం పంచదేవ్ పాడుకు వచ్చి నదిని దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న నాటుపడవ మునిగింది. అందులో ఉన్న 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైనవారిని సుమలత, రోజా, చిన్నక్క, నర్సమ్మగా గుర్తించారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నారాయణపేట జిల్లా ఎస్పీ […]

Read More

కలెక్టరమ్మా.. శభాష్​

సారథి న్యూస్, హైదరాబాద్‌: మహిళల సౌకర్యార్థం మొబైల్‌ ‘షీ టాయిలెట్’ ఏర్పాటు చేయడంపై నారాయణపేట జిల్లా కలెక్టర్‌ డి.హరిచందనను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభినందించారు. ‘మహిళల కోసం బయోడైజెస్టర్ టాయిలెట్ల ఏర్పాటులో కలెక్టర్‌ హరిచందన చొరవ ప్రశంసనీయం. ఈ గొప్ప ఆలోచన మహిళలకు సౌకర్యవంతమైనదే గాక భద్రతనూ కల్పిస్తోంది. అలాగే ఇవి బయోడైజెస్టర్‌ మరుగుదొడ్లు కావడం వల్ల స్థిరత్వం ఉంటుంది’ అని ట్విట్టర్​లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నారాయణపేట […]

Read More

అరక పట్టి.. సాలు కొట్టి

సారథి న్యూస్​, నారాయణపేట: మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ రైతన్నలా మారారు. అరక పట్టి పొలం దున్నారు. కొద్దిసేపు రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడ్జింత జడ్పీ హైస్కూలులో నూతనంగా నిర్మించిన అదనపు గదులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో పొలంలో విత్తనాలు వేస్తున్న రైతులను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. విత్తనాలు అందుతున్నాయా.. లేదా.. అని అడిగి ఆరా తీశారు. మంత్రి తమతో […]

Read More