సారథి న్యూస్, కర్నూలు: ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘నాడు నేడు’ పథకంలో చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా, త్వరగా పూర్తిచేయాలని కర్నూలు జేసీ2 రాంసుందర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో సర్వశిక్ష అభియాన్ పీవో, పంచాయతీరాజ్ ఎస్‌ఈ, తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,044 స్కూళ్లకు గాను 1,036 స్కూళ్లలో ‘నాడునేడు’ కింద వివిధ పనులు చేపడుతుండగా, 8 స్కూళ్లలో పనులను ఇంతవరకు ప్రారంభించలేదన్నారు. ‘మనబడి’ కింద ఎంపికైన […]