సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఓవైపు శాస్త్ర సాంకేతికరంగాల్లో దేశం ముందుకెళ్తున్నా ఇంకా కొందరి మూఢవిశ్వాసాలు, నమ్మకాలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కులం అమ్మాయిని కాకుండా మరో కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు గుడిలోకి అనుమతి లేదని కొందరు కులపెద్దలు అటవిక న్యాయం చెప్పేశారు. గుడిలోకి అనుమతి కావాలంటే ముందు మీ భార్యకు విడాకులు ఇచ్చిరావాలని కండీషన్ పెట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ ఆలస్యంగా […]