సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని బూరుగుపల్లి, కొలపల్లి తదితర గ్రామాల్లో నర్సరీలను ఈజీఎస్ ఏపీవో సుధాకర్ శుక్రవారం పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.