సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని పలుచోట్ల మున్సిపల్అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 5వ శానిటరీ డివిజన్ పరిధిలోని బుధవారంపేట సర్వజనాస్పత్రి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ, స్పైసి హోమ్స్ హోటల్స్ ను పరిశీలించారు. కుళ్లిపోయిన మాంసపు వంటకాలను తయారుచేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు గుర్తించిన శానిటరీ విభాగం అధికారులు దుకాణదారులకు రూ.11వేలు ఫైన్వేశారు. 13వ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎస్టేట్ లోని […]