చండీఘర్: పంజాబ్ రాష్ట్రంలో నకిలీ మద్యం సేవించి దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ న్యాయవిచారణకు ఆదేశించారు. అమృత్సర్, బాటాలా, టరన్టరన్ ప్రాంతాలకు చెందిన వారు నకిలీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ‘ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాను. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు’ అంటూ సీఎం అమరీందర్‌సింగ్ ట్వీట్ చేశారు.