సారథి న్యూస్, సిద్దిపేట: భారీ వర్షాలు కురుస్తున్న వేళ సిద్దిపేట జిల్లాలో ప్రమాదం సంభవించింది. సోమవారం నంగునూరు మండలం దర్గపల్లి గ్రామం సమీపంలో ఉన్న వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ముగ్గురిని ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో కాపాడారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ముగ్గురు మంథని వద్ద ఇసుక క్వారీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నందున […]