సారథి న్యూస్, గోదావరిఖని: రైతులకు నకిలీ సీడ్స్ విక్రయించే వారిపై చర్యలు తప్పవని, అటువంటి వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో వాటిని అమ్మాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ మహేందర్ రెడ్డి అన్ని ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. లాక్ డౌన్ సమయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ […]
సారథి న్యూస్, హుస్నాబాద్: పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఏసీపీ మహేందర్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం పలువురికి థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు చేశారు. పోలీసులు ప్రజలతో మాట్లాడేటప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, గ్లౌస్లు, మాస్కులు కట్టుకోవాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే నాన్ కాంటాక్ట్ ఈ చలాన్ ద్వారా కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై దాస సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం సారథి న్యూస్, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి జులై 5 వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్ష నిర్వహించాలని.. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఇస్తూ షెడ్యూల్ విడుదల చేసింది. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే విద్యార్థులను ఎగ్జామ్స్‌కు అనుమతించనున్నారు. ఆదివారం కూడా […]