హైదరాబాద్: కరోనా వారియర్స్‌ను ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆక్షేపించారు. మంత్రి ఈటల ప్రసంగం హెల్త్ బులెటిన్‌లా ఉందని విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో కరోనా.. నివారణ చర్యలపై చర్చ సందర్భగా ఆయన మాట్లాడారు. కోవిడ్ నిధికి విరాళాలు ఇచ్చినవారిని గుర్తించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కరోనా అనేక రంగాలపై ప్రభావం చూపిందన్నారు. అందుకు స్పందించిన సీఎం కేసీఆర్ మాట్లడుతూ.. అక్బరుద్దీన్ చేసిన విమర్శలను తప్పుబట్టారు. కరోనా నియంత్రణకు మంత్రి ఈటల ఆహర్నిషలు కృషిచేశారని ప్రశంసించారు. […]
తెలంగాణ ముద్దుబిడ్డకు భారతరత్న ఇవ్వాల్సిందే కాలం విసిరిన సంకెళ్లతో ముందుకెళ్లారు ప్రతిభాశాలి, రాజకీయాల్లో మేరునగధీరుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోరారు. పీవీ మన ఠీవీ, ఆర్థిక విధానాల సృష్టికర్త అని కొనియాడారు. ఏడాది కాలం పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన […]
క్రమశిక్షణ, కఠోరశ్రమ, అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ అసెంబ్లీ సంతాపం సారథి న్యూస్, హైదరాబాద్: భారతరత్న, దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభలో ప్రవేశపెట్టారు. ‘ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కోల్పోయింది. 1970 తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్‌ముఖర్జీ […]