సారథి న్యూస్, వనపర్తి: ఇటీవల భారీవర్షాలకు జిల్లావ్యాప్తంగా వాగులు, చెరువులు, నదులు ప్రమాదకరంగా ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నేపథ్యంలో ముంపు కాలనీల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు వాగు అలుగు ఉప్పొంగి వరద నీరు శ్రీరామ టాకీస్, శ్వేతానగర్, శంకర్ గంజ్, ప్రభుత్వ ఆస్పత్రి, చింతల హనుమాన్ ఆలయం, సుభాష్ వాడ ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు వచ్చి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్ […]