సారథి న్యూస్, కర్నూలు: మహిళ అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో ‘నాడు నేడు’ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. చిన్నారులకు ఆహ్లాదమైన వాతావరణం ఉండాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’, ‘పోషణ’ కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, డైరెక్టర్ కృత్తికా శుక్లా, జేడీ అడ్మిన్ శ్రీలత, ఆర్జేడీలు శైలజ, ఉమారాణి, చిన్మయదేవి పాల్గొన్నారు.