సారథి న్యూస్, హైదరాబాద్: రవీంద్రభారతిలోని తన ఆఫీసులో తెలంగాణ ఫామ్ నీరా, ఫామ్ ప్రొడక్ట్ రీసెర్చ్ ప్రొడక్షన్, వేద ఫామ్ ప్రొడక్ట్స్ సంస్థ తయారుచేసిన తాటి బెల్లం, ఈత సిరప్ ఉత్పత్తులను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సోమవారం విడుదల చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్. టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ గౌడ్, గౌడ సంఘం నాయకులు అంబాల నారాయణ గౌడ్, వింజమూరి సత్యంగౌడ్, భానుచందర్ పాల్గొన్నారు.