సారథి న్యూస్, మహబూబాబాద్: ప్రధాని మోడీ పాలనలో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. బీజేపీ ప్రభుత్వం మనువాద వ్యవస్థను పెంచి పోషిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను నాశనం చేసేలా ఉన్నాయని ఆక్షేపించారు. రైతుల బతుకులు దుర్భరంగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మహబూబాబాద్‌లోని ఆర్టీ గార్డెన్ లో ‘భారతదేశం కమ్యూనిస్టు ఉద్యమం.. వందేళ్ల ప్రస్థానం’ అనే అంశంపై నిర్వహించిన జిల్లాస్థాయిలో సదస్సులో […]