న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు తనపై వర్ణవివక్ష వ్యాఖ్యలు చేశారని కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వెనక్కి తగ్గాడు. తన సహచరులు ప్రేమతోనే ‘కాలూ’ అని పిలిచారని ఓ ట్వీట్‌తో తేల్చేశాడు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ‘నన్ను కాలూ అని పిలిచిన వ్యక్తితో మాట్లాడా. మా మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. మ్యాచ్‌ల బాగా ఆడినప్పుడు, ప్రేమ ఎక్కువైనప్పుడు అలా పిలుస్తారని చెప్పాడు. ఇందులో వర్ణవివక్ష […]
కింగ్స్టన్: ప్రపంచంలో కొనసాగుతున్న జాతి వివక్షపై అందరూ గళం విప్పాలని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. జాత్యహంకర ధోరణికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. క్రికెట్ లోకం దీనిపై మాట్లాడాలని కోరాడు. ‘ఐసీసీతో పాటు అన్ని సభ్యదేశాలు దీనిపై మాట్లాడాలి. ఈ దురాగతాన్ని ఖండించాలి. లేదంటే ఈ వివక్షలో వీళ్లు కూడా భాగస్వాములేనని అనుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక పిశాచి. దీనిని తరిమి కొట్టేదాకా […]