సారథి న్యూస్, రామగుండం: ప్రైవేట్ స్కూళ్ల సమస్యలను పరిష్కరించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ట్రస్మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ జనరల్ సెక్రటరీ అరుకాల రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆదర్, సండే సల్మారావు ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ స్కూళ్లను ఆదుకోవాలని, టీచర్ల జీతాలు ఇవ్వాలని, విద్యారంగాన్ని రక్షించాలని, టీచర్లకు నెలకు రూ.10వేల జీవనభృతి ఇచ్చి ఆదుకోవాలని కోరారు.