సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా పేరూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని టేకులగూడెంలో డాక్టర్ సీతారామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 61మందికి వైద్యపరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వ్యాధి నిర్ధారణ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఫార్మసిస్ట్ యాలం సతీశ్, హెల్త్ అసిస్టెంట్ కె.తిరుపతి రావు, ఎస్ఎన్ఎం జి.రజిత, ఎల్టీకే.అశ్విని, సర్పంచ్ వాసం కృష్ణవేణి, కార్యదర్శి యాలం వినోద పాల్గొన్నారు.