Breaking News

టీమిండియా

బౌలర్లకే ఎక్కువ ఇబ్బంది

ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ ముంబై: లాక్‌ డౌన్‌ తర్వాత రిథమ్‌ దొరికించుకోవడంలో బౌలర్లకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అన్నాడు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడానికి కనీసం ఎనిమిది వారాలైనా సమయం పడుతుందన్నాడు. సుదీర్ఘ విరామం నుంచి గాడిలో పడటానికి ప్లేయర్లు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నాడు. బౌలర్లు పూర్తిస్థాయిలో టెస్ట్‌లు ఆడాలంటే 8 నుంచి 12 వారాలు, వన్డేలకు 6 వీక్స్‌, టీ20లకు 5 నుంచి 6 వారాల సమయం […]

Read More

చాపెల్​ది స్వయంకృతాపరాధం

టీమిండియా మాజీ స్టార్​ బ్యాట్స్​మెన్​ కైఫ్​ న్యూఢిల్లీ: సరిగ్గా పనిచేసి ఉంటే ఆసీస్ మాజీ బ్యాట్స్​మెన్​ గ్రెగ్ చాపెల్.. టీమిండియాకు అత్యుత్తమ బ్యాటింగ్ కోచ్ అయి ఉండేవాడని మహ్మద్ కైఫ్ అన్నాడు. తన స్వయంకృతాపరాధం వల్లే పదేపదే తప్పులు చేస్తూ పేరును చెడగొట్టుకున్నాడన్నాడు. భారత్​కు జాన్ రైట్ ఇచ్చిన వారసత్వాన్ని నిలబెట్టలేకపోయాడని విమర్శించాడు. ‘చాపెల్ రాగానే జట్టులో బేధాభిప్రాయాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాడు. గంగూలీని కెప్టెన్సీ నుంచి తీసేయడం, క్రమంగా టీమ్​కు దూరం చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. […]

Read More

కోహ్లీ @ 180

ముంబై: లాక్​ డౌన్ కారణంగా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైనా.. ఫిట్​నెస్​ విషయంలో మాత్రం ఎవరూ తగ్గడం లేదు. తమకు అనువైన ప్రదేశంలోనే, తమకు నచ్చిన రీతిలో ఎక్సర్​సైజ్​లు చేస్తున్నారు. ప్రపంచ క్రికెటర్లలో బెస్ట్ ఫిజిక్, ఫిట్​నెస్ ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కసరత్తులు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. అత్యుత్తమ దేహాదారుఢ్యం ఆయన సొంతం. దానిని కాపాడుకునేందుకు చాలా శ్రమిస్తాడు కూడా. అతన్ని చూసి చాలా మంది సహచరులు కూడా ఫిట్​నెస్​ మంత్రను […]

Read More

మేమిద్దరం పంజాబీలం

కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. టీమిండియా ప్లేయర్లపై కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. కోహ్లీ, తాను పంజాబీలమని, తమ ఇద్దరి స్వభావం ఒకే తీరుగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ‘నేను, కోహ్లీ మంచి స్నేహితులం. అయితే మైదానంలో మాత్రం బద్ద శత్రువులం. ఇందులో తేడా లేదు. మా స్వభావం ఒకేలా ఉంటుంది. ఇద్దరం పంజాబీలం కాబట్టి. విరాట్ కు దూకుడు ఎక్కువ. ఆటలో ఇలానే ఉండాలి. నా కన్నా జూనియర్ అయినా చాలా గౌరవిస్తాను. కోహ్లీ […]

Read More

కోహ్లీ.. గడ్డం తీసేయ్!

న్యూఢిల్లీ: లాక్ డౌక్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఇవి కొన్నిసార్లు సానుకూలంగా ఉంటే.. మరికొన్ని ఆటగాళ్ల మధ్య విమర్శలకు తావిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్ మెన్ కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు. గతంలో తీసుకున్న ఓ ఫొటోను కోహ్లీ ఆదివారం ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దానికి స్పందించిన పీటర్సన్.. ‘నీ గడ్డం తీసేయ్ కోహ్లీ’ అంటూ […]

Read More

ధోనీ.. నంబర్​వన్​

మాజీ బ్యాట్స్​ మెన్ మహ్మద్ కైఫ్ న్యూఢిల్లీ: టీమిండియాలోకి ఎంతమంది వికెట్​ కీపర్లు వచ్చినా.. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ బ్యాట్స్​ మెన్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఫిట్​ నెస్, కీపింగ్ విషయంలో అతన్ని తలపించేవారు లేరన్నాడు. అందుకే ఇప్పటికీ మహీయే నంబర్​వన్​ కీపర్ అని చెప్పాడు. ‘ఐపీఎల్​తో పునరాగమనం చేద్దామని ధోనీ భావించాడు. కానీ అది వాయిదా పడింది. కానీ నా దృష్టిలో అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ధోనీ […]

Read More

ఏ కోచ్ అలా చేయడు

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీ: టీ20లకు ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ ఉండడం సరైందేనని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ‘స్పెషలిస్ట్ కోచ్​తో చాలా ప్రయోజనాలు ఉంటాయి. కోచ్​గా సక్సెస్​ కావాలంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన అనుభవం ఉండాలన్నది సరైన వాదన కాదు. టీ20ల్లో కోచ్ చేయాల్సింది.. ప్లేయర్లలో సానుకూల ధోరణిని పెంచడం. భారీ షాట్స్​ ఆడేలా, లక్ష్యాలు చేరుకునేలా […]

Read More
మేమిద్దరం భిన్నమైన ఆటగాళ్లం

మేమిద్దరం భిన్నమైన ఆటగాళ్లం

పాక్‌ టాప్‌ బ్యాట్స్​ మన్ బాబర్‌ ఆజమ్‌ కరాచీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, తాను భిన్నమైన క్రికెటర్లమని పాక్‌ టాప్‌ బ్యాట్స్​ మన్ బాబర్‌ ఆజమ్‌ అన్నాడు. తమను పరస్పరం పోల్చడం తెలివైన పనికాదన్నాడు. ‘నన్ను వేరే వాళ్లతో పోల్చకపోవడమే బెటర్‌. నేను భిన్నమైన క్రికెటర్‌ను. పరుగులు చేసి టీమ్‌కు సాయం పడడం నా బాధ్యత. మైదానంలోకి వెళ్లిన ప్రతిసారి నేను ఇదే పనిచేస్తా. నన్ను నేను నిరూపించుకుంటున్నా. కోహ్లీ ఇప్పటికే చాలా సాధించాడు. చాలా […]

Read More