సామాజిక సారథి, హాలియా: విదేశాలలో నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కు ఘన నివాళులర్పించారు. శుక్రవారం ఖతర్ దేశంలోని దోహా నగరంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అబ్బగౌని శ్రీధర్ అధ్యక్షతన దివంగత నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఖతార్ కార్యవర్గ సభ్యులు సుందరగిరి శంకర్, తాళ్ల పెళ్లి ఎల్లయ్య,కుంబాజి సాయి తేజ, మాసం రాజిరెడ్డి,శంకరాచారి, ప్రవీణ్,నర్సయ్య,భాస్కర్ గౌడ్, ఎండి సుభాని తదితరులు పాల్గొన్నారు.