న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు కొత్త వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. ఎక్కువ మంది సామాజిక మధ్యమాల్లో గడుపుతుంటే.. మరికొందరు వ్యవసాయంలో సేద తీరుతున్నారు. భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ గౌరీమాంగ్ సింగ్ కూడా తన పొలంలో సేంద్రియ సేద్యం చేస్తూ ఉత్సాహం పొందుతున్నాడు. ఇంఫాల్‌లో సోదరులతో కలిసి కూరగాయలు పండిస్తున్నాడు. ‘మా ఇంటి పక్కనే కొంత పొలం ఉంది. రెండేళ్ల నుంచి అక్కడ కూరగాయలు పండిస్తున్నాం. అయితే లాక్‌డౌన్‌తో నేను కూడా […]