సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్లపల్లి, కూరెళ్ల గ్రామాలకు సమీపంలో ఉన్న మోయతుమ్మెద వాగులో బుధవారం సాయంత్రం గుడ్డెలుగులు సంచరించడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు హడలిపోయారు. గుడ్డెలుగులు కొన్ని నెలలుగా ప్రజలు, రైతులు వ్యవసాయ క్షేత్రాలకు రాత్రివేళలో వెళ్లలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి జనారణ్యంలో సంచరిస్తున్న వాటిని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.