సారథి న్యూస్, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.1.23 కోట్ల వ్యయంతో ఆరు నూతన అంబులెన్స్ లను అందించారు. వాటిని సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు చేతులమీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, […]