Breaking News

ఖమ్మ

నైతికంగా గెలిచాం: భట్టి

నైతికంగా గెలిచాం: భట్టి

సామాజికసారథి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల్లో అతికష్టం మీద టీఆర్‌ఎస్‌ బయటపడి గెలిచిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో నైతికంగా కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. కేవలం 96 ఓట్లు ఉన్న కాంగ్రెస్‌కు 242 ఓట్లు రావడమే అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌  అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ లేదన్న అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించామని అన్నారు.

Read More