సారథి న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీవర్షాలకు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. రేణుకా ఎల్లమ్మ వాగు, పిల్లివాగు, మోయతుమ్మెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులో ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగులో గురువారం సాయంత్రం గుర్తుతెలియని ఓ యువకుడి డెడ్‌బాడీ కొట్టుకువచ్చినట్లు తెలిపారు. కొట్టుకొచ్చిన మృతదేహాన్ని వెలికితీయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సారథి న్యూస్, హుస్నాబాద్: కొడుకులు తన బాగోగులు చూసుకోవడం లేదని ఓ వృద్ధుడు సోమవారం అధికారులను ఆశ్రయించాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామపరిధిలోని శంకర్ నగర్ కు చెందిన పోతు మల్లయ్యకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. తనకున్న ఆస్తినంతా కొడుకులు లాక్కొని ఏ ఒక్కరూ చేరదీయకపోవడంతో అధికారులను ఆశ్రయించాడు. వృద్ధుడిచ్చిన ఫిర్యాదుకు స్పందించిన ఆర్డీవో జయచంద్రారెడ్డి మల్లయ్య గ్రామానికి వెళ్లి కొడుకులతో మాట్లాడారు. అయినా వారు వినిపించకపోవడంతో పోతు మల్లయ్యను అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న […]