విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ కొత్తపంథాను ఎంచుకోన్నారు. కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడగా.. నటీనటిలందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈక్రమంలో ప్రకాశ్‌రాజ్ కూడా ఓ వెబ్‌సీరిస్‌లో నటించనున్నట్టు తెలిసింది. దీని చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఓ యాధార్థ ఘటన ఆధారంగా ఈ వెబ్‌సీరిస్‌ను రూపొందిస్తున్నారట. దీనిలో ప్రకాశ్‌రాజ్ నటించడమే కాక కథా సహకారం కూడా అందిస్తున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.