మయన్మార్: నార్త్ మయన్మార్‌లో ఘోరప్రమాదం సంభవించింది. జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడడంతో వంద మంది చనిపోయారు. ఒక్కసారిగా మట్టి, నీళ్లు వచ్చిపడడంతో చాలా మంది చనిపోయారని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఇంకా చాలా మంది మట్టిలో కూరుకుపోయారని అన్నారు. ఇప్పటివరకు వంద మృతదేహాలను వెలికి తీశామని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. కచిన్ జిల్లాలో భారీవర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయని, గని దగ్గరలో పనిచేస్తున్న వారిపై కొండచరియలు విరిగిపడడంతో […]
20 మంది మృతి.. రెండు రోజులుగా భారీ వర్షాలు గౌహతి: అస్సాంలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సౌత్ అస్సాం బరాక్ వ్యాలీ రీజన్‌లోని మూడు జిల్లాల్లో కొండచరియలు పడి 20 మంది చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. కాచర్ జిల్లాలో ఏడుగురు, హైలాకండీలో ఏడుగురు, కరీమ్‌గంజ్ జిల్లాలో ఆరుగురు చనిపోయారు. రెండురోజులుగా భారీవర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. భారీవర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో […]