సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామంలో గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అందరూ కచ్చితంగా మాస్కులు కట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని డాక్టర్లు సూచించారు. బీపీ, షుగరు, టీబీ ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశావర్కర్లు, 104 వాహన సిబ్బంది పాల్గొన్నారు.
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొంగాల గ్రామంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి అవగాహన కల్పిస్తూ డాక్టర్ యమున సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు కట్టుకోవడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.