Breaking News

కేసారం

22న సంతోష్​బాబు ఇంటికి సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, సూర్యాపేట: గాల్వన్​ లోయలో చైనా సైనికులు జరిపిన దాడిలో మృతిచెందిన కల్నల్​ సంతోష్​ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈనెల 22న సీఎం కేసీఆర్​ సూర్యాపేటకు రానున్నారని మంత్రి జగదీశ్​రెడ్డి వెల్లడించారు. శనివారం కల్నల్​ కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. భవిష్యత్​లో కుటుంబ అవసరాల రీత్యా రూ.ఐదుకోట్ల నగదు, ఇంటి జాగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అలాగే సంతోష్​బాబు సతీమణికి గ్రూపు 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు.

Read More

కేసారంలోనే సంతోష్​ బాబు అంత్యక్రియలు

సారథి న్యూస్​, సూర్యాపేట: భారత్‌ సరిహద్దుల్లో చైనా దొంగ దెబ్బకు అమరుడైన కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం బుధవారం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరింది. వీరజవాన్​ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. సంతోష్‌బాబు భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్‌లో సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సూర్యాపేటకు తరలించారు. తొలుత హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు […]

Read More