గోదావరిఖని: సింగరేణి బొగ్గుగనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ పిలుపుమేరకు ఆర్జీ-1 లో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఏఐటీయూసీ కేంద్రకమిటీ సెక్రటరీ మెరుగు రాజయ్య మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, వేల్పుల కుమారస్వామి, మెండే శ్రీనివాస్, ఉల్లి మొగిలి, జీ ఆనందం, పీ రవి, ఏ […]