సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బుధవారం జూరాలకు 40,076 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోని ఆరుగేట్ల ద్వారా 8,956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కోసం మరో 16,162 క్యూసెక్కులను వినియోగిస్తూ జూరాల నుంచి మొత్తంగా 25,118 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్‌కు […]