వాషింగ్టన్: తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు హాలీవుడ్ ర్యాపర్ కాన్యే వెస్ట్ ప్రకటించారు. కాన్యే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభిమాని కావడం గమనార్హం. ‘నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. దేవున్ని విశ్వసిస్తూ, మన భవిష్యత్తును మనమే నిర్మించుకుంటూ అమెరికా హామీలను నెరవేర్చుకుందాం’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పోటీకి సంబంధించి క్యానే ఎన్నికల బ్యాలెట్‌కు ఏదైనా పత్రాలను దాఖలు చేశారా అనే విషయం తెలియరాలేదు. కాగా 2018లో ట్రంప్ ఎన్నిక తర్వాత వెస్ట్ తన […]