సామాజికసారథి, కాగజ్ నగర్: వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టంచేశారు. దమ్ముంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు బీసీలకు 70 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఎస్పీ అన్నివర్గాలను కలుపుకుని ముందుకెళ్తుందని అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. […]