సారథి న్యూస్, ఎల్బీనగర్ : భారత్-చైనా సరిహద్దులో సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నట్లు తెలిపారు. కల్నల్ మృతి పట్ల ఉప్పల శ్రీనివాస్ తీవ్ర విచారం వ్యక్తంచేసి వీర జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
సారథి న్యూస్, సూర్యాపేట: దేశం కోసం కల్నల్ సంతోష్‌బాబు చేసిన ప్రాణ త్యాగానికి యావత్ భారతావని సెల్యూట్ చేస్తోందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో అమర జవాన్ సంతోష్ బాబు తల్లిదండ్రులు, ఇతర సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గంటకుపైగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆర్మీ అధికారులు కోరుతున్నారని, కానీ సూర్యాపేటలో సంతోష్ అంత్యక్రియలు జరిపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారని తెలిపారు. సంతోష్ భౌతిక కాయాన్ని త్వరగా రప్పించడానికి అన్ని […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఇండియా– చైనా సరిహద్దులో చోటుచేసుకున్న ఘర్షణలో మంగళవారం సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతిపై సీఎం కేసీఆర్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడం నుంచి అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ఆయన ఆదేశించారు.