సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కంటైన్ మెంట్ జోన్ లో లాక్ డౌన్ ప్రక్రియను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. సోమవారం పాతపట్నంలో పర్యటించిన ఆయన స్థానిక తహసీల్దార్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ ఇళ్లలోనే గృహనిర్బంధంలోనే ఉండాలన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు. సమావేశంలో పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి టీవీఎస్ జీ కుమార్, తహసీల్దార్లు పి.రమేష్ బాబు, సురేష్, కాళీప్రసాద్ […]