వెల్లడించిన ఎలక్షన్కమిషన్ ఓటరు జాబితా విడుదల న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా 2022ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన దరఖాస్తులను పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల ఫైనల్లిస్టును ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారని తెలిపింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474 మంది, మహిళా ఓటర్లు 1,50,98,685 మంది, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారని […]