న్యూఢిల్లీ: సెప్టెంబర్ లో ఆసియాకప్ నిర్వహణపై నిర్వాహకులు ఏటూ తేల్చలేకపోయారు. టీ20 ప్రపంచకప్ పై తుదినిర్ణయం రానున్న నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కూడా తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. తర్వాతి సమావేశంలో ఆసియాకప్ పై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఆసియాకప్ ఆతిథ్యాన్ని తమకు కేటాయించాలని శ్రీలంక బోర్డు చేసిన విజ్ఞప్తికి ఏసీసీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆతిథ్య విషయంలో పీసీబీ కూడా తమకు మద్దతిచ్చిందని లంక బోర్డు చీఫ్ షమ్మీ సిల్వా వెల్లడించాడు. వాస్తవానికి […]