సారథి, రామగుండం ప్రతినిధి: కరోనా కష్టకాలంలో వార్తలను సేకరించి ప్రజలకు చేరవేస్తున్న గోదావరిఖని ప్రెస్, మీడియా రిపోర్టర్లకు ఏసీపీ ఉమెందర్ చేతి రుమాలు అందజేశారు. జర్నలిస్టులు వడదెబ్బ బారినపడకుండా చూసుకోవడం తమ బాధ్యత అన్నారు. కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ సీఐలు రమేశ్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు ప్రవీణ్, ఉమాసాగర్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.