Breaking News

ఏకాదశి MAHABUBNAGAR

ఇంట్లోనే తొలి ఏకాదశి జరుపుకోండి

ఇంట్లోనే తొలి ఏకాదశి జరుపుకోండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జూలై 1న తొలి ఏకాదశి పర్వదినాన్ని మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి రాకుండా ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కోరారు. సోమవారం ఆయన విలేకరులో మాట్లాడారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకి రాకుండా ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు.

Read More