సామాజిక సారథి, వెల్దండ: పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ వ్యక్తిపై నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు చేయి చేసుకున్నారనే ప్రచారం సరికాదని అఖిలపక్ష నేతలు మూకుమ్మడిగా పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి పట్ల కొంచెం గట్టిగా మాట్లాడారని తెలిపారు. ఎస్సై నర్సింహులు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక వర్గాల ప్రజల పట్ల సౌమ్యంగా ఉంటారని తెలిపారు. సమస్య ఎలాంటిదైనా, ఎవరు స్టేషన్కు వెళ్లినా చాలా సావధానంగా వింటూ పరిష్కరిస్తారని చెప్పారు. ఆయనపై బురద చల్లే ప్రయత్నంలో కొందరు […]