సారథి న్యూస్, కర్నూలు : నంద్యాల మండలం చాపిరేవుల టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. గూడ్స్ కొరియర్ లారీని కారు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తూన్న ఎస్‌బీఐ ఉద్యోగి శివకుమర్ సజీవదహనం అవగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.