సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో వేములవాడ- తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలో వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పది గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన పది షాపుల యజమానులపై చర్యలు తీసుకున్నారు. ఆయన […]