సారథిన్యూస్, మహబూబాబాద్: ప్రజలు మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51 (బీ) చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు గుంపులుగా తిరిగినా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ముఖ్యమైన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార సముదాయల్లో ఎప్పటికప్పడు తనిఖీ చేస్తామని.. మాస్క్ లేకుండా ఎవరైనా కనిపిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.