Breaking News

ఎస్టీయూ

ఎస్టీయూ సభ్యత్వ నమోదు

ఎస్టీయూ సభ్యత్వ నమోదు

సామాజిక సారథి, ములుగు: ఎస్టీయూ ములుగు జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో మోడల్ స్కూలు, బండారుపల్లి, జాకారం, మల్లంపల్లి, కోయగూడం, భూపాల్ నగర్ ప్రభుత్వ స్కూళ్లలో యూనియన్ ​సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల రేషనలైజేషన్ జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తూ పాత జిల్లాల ప్రకారం పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూలు టీచర్లకు 010 ద్వారా వేతనాలు చెల్లించి హెల్త్ కార్డు […]

Read More
ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా ఎస్టీయూ ఆవిర్భావ వేడుకలు

సారథి, ములుగు: స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) 75వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సోలం క్రిష్ణయ్య పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబుల హయాంలో 1946 మే 17న మగ్దూం మొహియుద్దీన్ ఇంట్లో కొందరు ఉపాధ్యాయుల సమావేశమై పురుడుపోసుకున్న సంఘం 1947 జూన్ 9న హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూనియన్ గా ఆవిర్భవించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఎస్టీయూగా రూపాంతరం చెంది నాటి నుంచి […]

Read More
ఎస్టీయూ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

ఎస్టీయూ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

సారథి న్యూస్, ములుగు: జిల్లాలోని ఎస్టీయూ భవన్ లో జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనియన్​ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వతరెడ్డి హాజరయ్యారు. దేశంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా కొనియాడే సంప్రదాయం ఉందని, అయినా మహిళలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా అందించే సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు ఉపాధ్యాయినులు సుమలత, సునిత, సుధారాణి, లవనిక, లలిత, రాజేశ్వరిని అవార్డులతో సత్కరించారు. […]

Read More
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ పీఆర్సీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటుందని ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వత్​రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ములుగు ఎస్టీయూ భవన్లో అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ అధ్యక్షతన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ, మోడల్ స్కూలు టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ముందుండి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్టీయూ మద్దతు ప్రకటించించిన […]

Read More
కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

సారథి న్యూస్, ములుగు: కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఎస్​టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ​డిమాండ్​ చేశారు. గురువారం స్థానిక ఎస్టీయూ భవన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సీఆర్టీ ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలని, హెల్త్​కార్డులను జారీ చేయాలని డిమాండ్​ చేశారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని, హాస్టల్​ బాధ్యతలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించాలని […]

Read More
టీచర్ల మహాధర్నా సక్సెస్​

టీచర్ల మహాధర్నా సక్సెస్​

సారథి న్యూస్, ములుగు: విద్యారంగ సమస్యలపై హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జాక్టో, యూఎస్​పీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైందని ములుగు జిల్లా జాక్టో చైర్మన్ ఏళ్ల మధుసూదన్ తెలిపారు. కార్యక్రమానికి ములుగు జిల్లాలోని 9 మండలాల నుంచి తరలివెళ్లినట్లు తెలిపారు. ధర్నాలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సోలం కృష్ణయ్య, ఎస్టీయూ ములుగు మండలాధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, వెంకటాపూర్ అధ్యక్షుడు బండారి జగదీశ్, రామారావు, రమణయ్య, శేషాచలం, గోవర్ధన్, భాస్కర్, మంగపేట […]

Read More